Labels

Friday, March 21, 2014

Govinda...govinda..

నారాయణ ...ఓం నమో నారాయణ .
పామరులు చేసే పారాయణ ..కాని,కరుణిస్తావా ఒసారైన ?
నీ కీర్తిని పొగిడే పురాణ గాధలు మెండైనా ..!
నిను చూసింది లేరు ఒక్కరైన .
మొక్కు పేరుతో లంచం తేసుకోనిదే నువ్వైనా .
కైలాసం దిగిరావు ఒక్క అడుగైనా .
బ్రహ్మ రాత అంటావే అది రాసింది నువ్వైనా
కర్మ ఫలం అంటావే నీకు చేసిన పూజలు ఎన్నైనా .
అమృత చిలకనలో రాక్షసులు మీకు తోడైనా...
మిగిల్చారా పాపం వారికి ఒక గుక్కేడైనా .
రావణ సంహారం అని మీరు పలికే ప్రగల్బాలు ఎన్నైనా ..
మరిచార ఆ ముహూర్తం పెట్టింది రాజనీతి పాలకుడు రావనుడైనా .
ఏళ్ల తరబడి తపస్సు చేసే ఋషులుకైనా
తెలియదే మిగిలింది ఏమిటో వారికైనా ..
కళ్ళ ముందు తిరిగే అమ్మాయి అయినా ..
ప్రెమించదె నమ్మకం లేని సమయాన .
అందనంత ఎత్తులో కూర్చుంటే ఏడుకొండలపైన..
మేం నిను నమ్మకపోవడం తప్పా ఏమైనా 

Thursday, March 13, 2014

మీకు కృతజ్ఞుడను

శత్రువులకి నేను "వీడెంత "? అనేలోపు అనిపిస్తా "వీదికింతా..! కాదు మరి ఐంస్టీన్ అంత . కాని తీసిపోను వారికి ఎంతోకొంత . ఆశలు చూస్తే ఆకాశమంత .. ఆచరణకొస్తే అయోమయం కొంత . ఉన్నారుగా నాకు మీరంతా .. మీకు క్రుతగ్నుడునై ఉంటా ఇకముందంతా ..

Wednesday, March 12, 2014

బ్రహ్మ -భ్రమ

దేవుడు చేస్తాడు ఒక బొమ్మ ..

దానికి ప్రాణం పోసేది అమ్మ ..

ఆ అమ్మ మనకిచ్చింది ఈ జన్మ ..

కాని మన తలరాత వ్రాసేది మాత్రం ఆ బ్రహ్మ ..

తలరాత అని ఏడుస్తూ కూర్చుంటే అది నీ కర్మ ..

ఇంటర్వ్యూ


కనులు తెరవగానే ఇంటర్వ్యూ ల సాక్షాత్కారం ...
అటెండ్ అవుతున్నా ప్రతిసారి తిరస్కారం .
ఇన్న్నాళ్ళు కూడబెట్టుకున్న డిగ్రీల సమాహారం ...
గుర్తు చేసి మరీ చేస్తున్నాయి వెటకారం .
చేసుకోవాలంటే మన కలలన్నీ సాకారం ...
తావియ్యకూడదు నిరాశ-నిస్పృహలకి ఆస్కారం .
ఎదురయ్యే ప్రతి ప్రశ్నకి ఉంటుంది ఒక పరిష్కారం ...
శోదించి సాదిస్తే , ఆ ఓటమే తలవగ్గి చేస్తుంది సత్కారం .
హో ... దేవుడా ...! పెడుతున్న మీకు నమస్కారం ...
అందించవయ్య కాస్త మాకు నీ సహకారం .

పలికే గోరింక -నీ గోడు వినేది ఎవరింక ?


నువ్వు లేక నేను లేను

అనేంతగా మారింది ఈ ఫోను

తూహీ మేరీ జాను

అంటూ కలిసిందా ఏమైనా లైను

ఫోన్ పెట్టేయాలంటే ఎంతో పెయిను

... కాని, అగుపిస్తుంది నీకది ఒక గోల్డెన్ చెయిను

ముద్దు -ముద్దు మాటలకి అయిపోకురా ఫ్యాను

మొద్దుగా మారాల్సి వస్తాది పోను పోను

మేఘమా -దరి చేరుమా

కదిలే మేఘమై చెదురుతుంది లక్ష్యం ..
కరిగే మంచై పోతుంది సమయం ..
రెప్పచాటు దొంగై చూస్తుంది నయనం ..
రేబవళ్లు ఏకమై సాగుతుంది సమయం ..
కడలి అలలై ఎగిసిపడుతుంది ఆవేశం ..
ముసలి ప్రాయమై వెక్కిరిస్తుంది అవకాశం..
కాని , గురువై నేర్పుతుంది అనుభవం ..
అదే వరమై కూర్చుతుంది ఈ జీవితం ..